Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 7:40 pm Posted by : ramakrishna

మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల గర్ల్స్ జూనియర్ కళాశాలలో మంగళవారం మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ల చెక్కులను గర్ల్స్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధరాజ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 53 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.  పదవ తరగతిలో మంచి మార్కులు ఆ వచ్చిన విద్యార్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు.  అందులో నిజామాబాద్ గర్ల్స్ కళాశాల, పాలిటెక్నిక్ గర్ల్స్ కళాశాల, వర్ని గర్ల్స్ కళాశాల, ఆర్మూర్ గర్ల్స్ కళాశాల నుండి మొత్తం 53 మంది విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మలబార్ మేనేజర్ అక్షయ్, మలబార్ స్టోర్ మేనేజర్ ప్రశాంత్, మార్కెటింగ్ మేనేజర్ ఇమ్రాన్  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.