ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాయిలాల పంపిణీ షురూ

టీచర్స్ ఓట్ల కొనుగోలు ప్రారంభం గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసం అభ్యర్థుల బేరసారాలు   నిజామాబాద్, బతుకమ్మ : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ నెల 27న జరుగనున్నా గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల కోసం ప్రచార పర్వం ముగింపునకు వచ్చింది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించిపోయాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఎన్నికలలో కార్పొరేట్ రంగంలో...