ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పత్రాల పంపిణీ

ఇందల్వాయి,బతుకమ్మ : ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూసద్వినియోo చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం ఎల్‌పీజీ సబ్సిడీ పత్రాలను అర్హులైన వారికి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామన్నారు. సిలిండర్‌ తీసుకున్న నాలుగు రోజుల్లో రాయితీ డబ్బులు జమ కాకుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు....