Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 6:53 pm Posted by : ramakrishna

కళ్యాణ లక్ష్మి చెక్కుల  పంపిణీ

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామం లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,సబ్ కలెక్టర్ కిరణ్మయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలను ప్రజలు పొందవచ్చని ఆసుపత్రిసేవలు, ఇళ్లులేని వారు ఇందిరమ్మ ఇళ్లు ఇలా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందగలరని ఎమ్మెల్యే  తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా కౌంటర్ లు పెట్టి రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిచ్కుంద ఎమ్మార్వో తాసిల్దార్, ఎంపీడీవో గోపాలకృష్ణ, బిచ్కుంద ఆర్ ఐ రవీంద్రనాథ్, కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగనాథ్,కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Distribution of Kalyana Lakshmi Cheques