Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 4:19 pm Posted by : ramakrishna

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

బతుకమ్మ, బాన్సువాడ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 122 మంది లబ్ధిదారులకు రూ. 1.22 కోట్ల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, మాజీ ఛైర్మన్ గంగాధర్, నాయకులు ఎజాజ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.