Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 8:15 pm Posted by : ramakrishna

గుండెకల్లులో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామ లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను గ్రామ సర్పంచ్ రాజు పటేల్, ఉప సర్పంచ్ లాలయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందని సర్పంచ్ రాజు పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ పటేల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.