Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 4:42 pm Posted by : ramakrishna

కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని లద్దిదారులకు ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బాన్సువాడ పట్టణం కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించారు. బాన్సువాడ పట్టణం, గ్రామీణ మండలానికి చెందిన 46మంది లబ్దిదారులకు, బీర్కూర్ మండలంలోని 30మందికి, నసురుల్లాబాద్ మండలానికి చెందిన 23మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ పట్టణ, బాన్సువాడ గ్రామీణ, నసురుల్లాబాద్, బీర్కూర్  మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Distribution of Kalyana Lakshmi and Shaadi Mubarak cheques