బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలానికి మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆదివారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో 24 మంది లబ్ధిదారులు, గ్రామీణ మండలంలో 31 మంది లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహశీల్దార్ వరప్రసాద్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ గంగాధర్, నార్ల సురేష్, ఎజాజ్, మధుసూదన్ రెడ్డి, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
