పండుగ వాతావరణంలో వడ్డీ లేని రుణాల పంపిణీ
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని సెగ్మెంట్లలో ఏకకాలంలో పండుగ వాతావరణంలో జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయం నుండి మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీ.ఈ.ఓ దివ్య దేవరాజన్ తదితరులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి...