బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో నియోజకవర్గం లోని బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు 4 కోట్ల రూపాయల ఇండ్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
