ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, సులేమాన్ నగర్, రుద్రూర్ గ్రామాలల్లో ఐకేపి మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఈ చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నారోజి గంగారం, ఓబీసీ జనరల్...