ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమార్థం అందిస్తున్న నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా చీరలను నాణ్యతతో అందించడం పట్ల గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు....