లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ
బతుకమ్మ,మెండోరా: మెండోరా మండల కేంద్రంలోని వెల్గటూర్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల సోమవారం లబ్ధిదారులకు అందించడం జరిగింది. భూమి పూజ లబ్ధిదారులు చెయ్యడం జరిగింది .ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం సోనియమ్మ మాకిచ్చిన వరం అంటూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తేలియజేసారు. కార్యక్రమములో కార్యదర్శి భార్గవ్, చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రవీంధర్,మాజీ సొసైటీ చైర్మన్ సోమ్ గంగారెడ్డి, ఇందిరమ్మ కమిటి సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.