Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 5:57 pm Posted by : ramakrishna

సిఎం పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశానుసారం ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు. నాయకులు కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. మండలంలోని త్రియంబపేట్. చంద్రన్ పల్లి. గ్రామాలలో మాజీ ఉపసర్పంచ్ బానోత్ చంద్రకళ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ రబీ సీజన్ ఆరంభం నాటికి ప్రతి రైతుకు రైతుబంధును అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే వరి ధాన్యాన్ని విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి 500 రూపాయల అదనపు బోనస్ ఇస్తుందని రైతులు గమనించాలన్నారు. పండ్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి దశరథ్. డిసిసి డెలిగేట్ తలారి సుధాకర్. పిఎసిఎస్ డైరెక్టర్ సుధాకర్. మాజీ చైర్మన్ గోపాల్. మాది సాగునీటి సంఘం చైర్మన్ గట్టు కడారి. మాజీ ఉప సర్పంచ్ మోతిలాల్ నాయక్. తీర్మన్ పల్లీ మాజీ ఎంపీటీసి భూ లక్ష్మీ. అసది పరమేశ్వర్.పూజ్యం రవికుమార్. వసంత్ రావు.మాజీ సర్పంచ్ బలరామ్ నాయక్. విట్టల్ నాయక్.తదితరులు పాల్గొన్నారు.

Distribution of fruits to patients on the occasion of CM's birthday