ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

  . . . బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన సందర్బంగా పండ్ల పంపిణీ   బాన్సువాడ, బతుకమ్మ :   బీఅర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కెసిఆర్ జన్మదినం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను పరామర్శించి బ్రెడ్డు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫిరోజ్ ఖాన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.