ప్రయాణికులకు పండ్లు పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ లో ప్రయాణికులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ పద్మజ, పర్సనల్ ఆఫీసర్ పద్మజ, డిపో మేనేజర్ ఆనంద్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.