Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2025, 5:57 pm Posted by : ramakrishna

ఉచిత పాఠ్యపుస్తకాల అందజేత

బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్  చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా  కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫారూఖ్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించారని తెలిపారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినిలు కామారెడ్డి జిల్లాలోని ఏకైక బాలికల జూనియర్ కళాశాల కావడంతో  కళాశాలలో భారీ సంఖ్యలో అడ్మిషన్లు పొందుతున్నారని తెలిపారు.కళాశాలకు ఉచిత హాస్టల్ వసతి, ఉచిత పాఠ్య పుస్తకాలు , ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థినులకు స్కాలర్షిప్స్ సౌకర్యం, నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో… సీసీటీవీ పర్యవేక్షణలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఈసి,హెచ్ఇసి, అలాగే ఒకేషనల్ కోర్సులు ఎం పి హెచ్ డబ్ల్యు, కంప్యూటర్ సైన్స్ , ల్యాబ్ టెక్నీషియన్,ఎమ్ఎల్టీ కోర్సులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు బీటెక్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందని చేప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Distribution of free textbooks