Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 7:02 pm Posted by : ramakrishna

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ

 

రుద్రూర్(వర్ని), బతుకమ్మ :

 

వర్ని మండల కేంద్రంలోని శ్రీనగర్, పాత వర్ని, ఎస్ ఎన్ పురం, వడ్డేపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థి, విద్యార్ధినులకు మాదాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా పరీక్ష అట్టలు, జామెంట్రీ బాక్స్, పెన్నులను అందజేశారు. మొత్తం 120 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మాదాల సాంబ శివరావు, ట్రస్ట్ సభ్యులు పి.వి.సుబ్బారావు, ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్, శివన్నారాయణ, నగేష్, శివరాజు, కోటేశ్వరరావు, భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.