Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 4:46 pm Posted by : ramakrishna

బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వరదలకు గురైన  కామారెడ్డి పట్టణంలోని బాధితులకు మంగళవారం నిత్యవసర సరుకులను అందించారు.  రాజంపేట మండలంతో పాటు వరద ప్రభావానికి గురైన రాజంపేట బాధితులకు నిత్యవసర సరుకులు అందించాలని ఆర్డీవోను ఆదేశించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో వర్షం కురిసిన అధిక వర్షాల వలన  సంభవించిన వరద ప్రభావానికి గురైన కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా  ఇప్పటికే తాత్కాలిక నష్టపరిహారం అందించడం జరిగిందని అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దుప్పట్లు, చెద్దర్లు, చీరలు, బియ్యం,,పప్పులు తదితర నిత్యవసర వరుసరకులను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి ఆర్డిఓ వీణ, తాసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Distribution of essential commodities to victims