Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 4:55 pm Posted by : ramakrishna

వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

మహమ్మద్ నగర్, బతుకమ్మ : మహమ్మద్ నగర్ మండలంలో గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు వచ్చిన వరదలకు మండలంలోని తుంకి పల్లి గ్రామం లో ఎస్సీ కాలనీలు ముంపునకు గురైంది. ఈ వరదల వల్ల ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరడం వల్ల వాళ్ళని సురక్షిత ప్రాంతానికి గవర్నమెంట్ స్కూల్లోకి తరలించారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్ సింగీతం గ్రామానికి చెందిన కొండ అనిల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఒక్కొక్క కుటుంబానికి 20 కేజీల సన్న బియ్యం, పదిహేను రోజులకు అవసరమైనటువంటి నిత్యవసర సరుకులను పంపించేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు అరుణా తారా, గంగారం చేతుల మీదుగా పంపిణీ చేశారు.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని జిల్లా అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు సతీష్, రాజు, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పండరి, యువమోర్చా అధ్యక్షులు సంతు, సీనియర్ నాయకులు రవి గౌడ్, లింగాల శంకర్, రాంప్రసాద్, రైతు రాజు పుప్పాల విటల్, వెంకట్ రెడ్డి కృష్ణ, పోచయ్య, శ్రీనివాసు, సాయిబాబా, కాశిరాం,  వివిధ గ్రామాల బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Distribution of essential commodities to flood victims