. . . పాల్గొన్న కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తాన గౌస్
బాన్సువాడ, బతుకమ్మ :
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డు పరిధిలో టీచర్ కాలనీలలో కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తాన గౌస్ పాషా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వో లకు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఫారాలను అందించి, నిర్ణీత గడువులోగా వాటిని సేకరించాలని సూచించారు. ఓటర్లు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి బీఎల్ ఓలకు అందించాలని అయన కోరారు. ప్రతి ఇంటికి చేరుకొని ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేసి ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్, బీఎల్వో ఉన్నారు.