కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ పాఠశాలలకు కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బుధవారం డ్యుయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేసినట్టు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి పేరు పైన ఉన్నటువంటి కె.పి రాజారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు డ్యూయల్ డేస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలని, డ్రైవర్స్ కాలని, అడ్లూర్ ఎస్సీ కాలని, అడ్లూర్ మండల పరిషత్ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీలు అందజేయటం జరిగిందని ఆయనన్నారు. గత విద్యాసంవత్సరం ముగింపు లో నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్ విద్యార్థులకు సరిపడా దాదాపు 6 వేల డ్యుయల్ డెస్క్ లు ఇవ్వడం జరిగిందని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయిన తరువాత గత 20 రోజుల నుండి నియోజకవర్గం లోని ప్రాథమిక పాఠశాలలకు దాదాపు 8 వేల డ్యూయల్ డెస్క్ లు అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గౌరవంగా చదవాలనే ఉద్దేశంతో డ్యూయల్ డెస్క్ బెంచీలు తన సొంత ఖర్చుతో ఇస్తున్నారని ఆయన తెలిపారు.