అంకాపూర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

నిజామాబాద్, బతుకమ్మ  : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి, 92 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. పండుగ వాతావరణం నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపించి, లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. సుదీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న డబుల్ బెడ్రూం ఇంటి కల సాకారం...