మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద రెడ్డి రూ.1,50,000 విలువ గల మూడు కంప్యూటర్స్, ఒక ప్రింటర్ గురువారం వితరణ చేయడం జరిగింది. వీటిని పిడి రాజ్ కుమార్, నావనంది గణేష్ , పిడి శ్యామ్ ద్వారా పాఠశాలకు అందజేయడం జరిగింది ,ఈ సందర్భంగా వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ,ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్, ఉపాధ్యాయులు అశోక్ ,రవీందర్, దీపిక, శకుంతల, అనిత, పద్మ,ఇందిరా, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.