మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని ధర్మరో గ్రామానికి చెందిన పలువురు బాధితులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో గ్రామానికి చెందిన గజ్జెల నాగమణికి రూ.60వేలు, ఆడెపు రాజుబాయికి రూ.19,500 ఆర్థికసాయం మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు అనిల్, శ్యామ్ గౌడ్, మహేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.