సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సదాశివనగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు ఆదేశాలతో సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు 16 గ్రామాల్లో 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కులను మంగళవారం వారి గృహాలకు వెళ్లి అందజేశారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 34 కాగా, పంపిణీ చేయబడిన మొత్తం రూ.9,63,000/-.సీఎంఆర్‌ఎఫ్ నిధులు సామాన్య ప్రజల జీవితాల్లో కీలకమైన ఆర్థిక మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వైద్యం, విద్య, ఇతర అత్యవసర...