Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 2:48 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నపల్లి గ్రామానికి చెందిన వడ్లూరి స్మరణి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రి చికిత్స నిమిత్తం కొరకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుల చారి దినేష్ కుమార్ చొరవతో వారి కుటుంబానికి 51,500 రూపాయల చెక్కును శుక్రవారం పంపిణీ చేసినట్లు బీజేపీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ తెలిపారు. బిజెపి పార్టీ అంటేనే బడుగు, బలహీన వర్గాలు, పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షులు నాయిడి రాజన్న, జిల్లా కార్యదర్శి ఉప్పు సవిత, కన్వీనర్ జెల్లెల్ల శ్రీనివాస్, గ్రామ బీజేపీ సీనియర్ నాయకులు సందీప్ గౌడ్, మోతే రాజు, సంతోష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.