Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 3:56 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతకమ్మ : నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిది ద్వారా 145మందికి 41,75,500 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గనికి రావడం జరిగిందని అన్నారు. కానీ ఇంకా చెక్కుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం మరియు అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలే డిమాండ్ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Distribution of CMRF Cheques