బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలో సోమవారం మొత్తం 26 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు, అనారోగ్య భారినపడిన వారికి నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి, సీనియర్ నాయకులు వై శ్రీ, ఏఎంసీ డైరెక్టర్ రంజిత్, యువజన అధ్యక్షుడు నర్సారెడ్డి, బెల్లాల శ్రీనివాస్, పుప్పల రాజేందర్, లింబాద్రి, రాడే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
