Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2024, 6:38 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల గ్రామానికి చెందిన 6 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం పంపిణీ చేశారు.  లబ్ధిదారులు మాట్లాడుతూ తాము అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్లో ఆర్థికంగా ఖర్చుల పాలైన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా బాల్కొండ ఇన్చార్జి సునీల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో సునీల్ రెడ్డి వెంటనే స్పందించి తమకు సిఎంఆర్ ఎఫ్ చెక్కులు ఇప్పించడానికి కృషిచేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి, మండల కాంగ్రెస్ రైతు అధ్యక్షుడు ముస్కు మోహన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూరాకుల బొర్రన్న, దండేవోయిన మేకల సాయన్న , పన్నాల నర్సారెడ్డి, పాకాల ప్రసాద్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.