భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలో వివిధ వార్డులో మంజూరైనటువంటి 10 సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో 10 మందికి రూ.358500. (మూడు లక్షల 58 వేల 500 రూపాయల) సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయి .అట్టి చెక్కులను భీమ్ గల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు . చెక్కు మంజూరుకి సహకరించిన ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులువారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామీ, మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలతో సురేందర్, టౌన్ ప్రెసిడెంట్ జె జె నర్సయ్య,ఎస్సీ సెల్ అనంతరావు.,యువజన నాయకులు వాకా మహేష్,విలేజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి,మండల మహిళా అధ్యక్షులు కల్పన,పట్టణ మహిళా అధ్యక్షులు గంగామణి, సతీష్, రంజిత్, వంశీ, దినేష్, దశ గౌడ్, దావూద్, షాదుల్లా, నవీన్, జిశాన్, ధనుష్, శ్రీకాంత్, ప్రదీప్, కిరణ్.దాస్, అనిల్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.