Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 7:07 pm Posted by : ramakrishna

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలానికి చెందిన లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం చెక్కుల పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కష్టమైనప్పటికీ రేవంత్ రెడ్డి  ప్రజలకు అండగా నిలవడం గొప్ప విషయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి భిక్కనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపారి భీమ్ రెడ్డి, లబ్ధిదారులు పైల బాపురెడ్డి ,నాగర్తి చిన్న భూమ్ రెడ్డి, పలు గ్రామాల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.