సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన సదాశివనగర్, రాజంపేట్, రామారెడ్డి, తడ్వాయి మండలాల నుంచి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆదివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య రంగంలో అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయం. ఇప్పటి వరకు అత్యధికంగా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులు పంపిణీ చేయడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్న...