Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 6:14 pm Posted by : ramakrishna

సీఎం రిలీఫ్‌ ఫండ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లబ్దిదారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సీఎం రిలీఫ్‌ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 130మందికి చెక్కులు వచ్చాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునే వారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి, ముఖ్య మంత్రి సహాయ నిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. లబ్దిదారులకు భారం కాకుండా చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుసుకున్న నెలలోపు వచ్చేల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే అప్లై చేసుకున్న మొత్తంలో 50% విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.