సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

బతుకమ్మ భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ శనివారం పంపిణీ చేశారు. భిక్కనూరులో జరిగిన కార్యక్రమంలో 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఇంద్రకరణ్...