సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన లబ్ధిదారు కళ్యాణికి మంజూరైన రూ.26 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నెర్రె నర్సింలు, బాన్సువాడ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పట్లోళ్ల పర్వారెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గోపన్ పల్లి సాయిలు, జలీల్, మన్నె చిన్న సాయిలు, బేగరి సాయిలు, భరత్, మన్నె రమేశ్, మన్నె నాగభూషణం పాల్గొన్నారు.