Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 11:40 am Posted by : ramakrishna

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

వేల్పూర్, బతుకమ్మ:  మండలంలోని పడగల్ గ్రామానికి చెందిన సురుకుట్ల నాగార్జునకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.60వేల ఆర్థిక సాయం మంజూరైంది. స్థానిక నాయకులు ఆయనకు శుక్రవారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున తనకు ఆర్థిక సాయం మంజూరు చేయించిన సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి జాన్ నల్లరాజు, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.