సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

బతుకమ్మ, నందిపేట్  : నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని చింతకుంట కవిత  ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 13000 రూపాయల చెక్కును ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు  మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొజ్జి రాజేందర్, గొజ్జి కిసాన్, మల్లేష్, చిన్నారెడ్డి, గాదరి లింగం, పీరాజీ నాగరాజు, చందు ఆపిల్ మెన్స్ తదితరులు పాల్గొన్నారు.