Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 6:08 pm Posted by : ramakrishna

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో పర్యావరణహిత, మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. గొల్లపల్లి బస్టాండులో 108, ఎల్లారెడ్డిపేట బస్టాండ్ లో 108  మొత్తం 216 విగ్రహాలను మంగళవారం పంపిణీ చేసినట్లు తెలిపారు. స్థానికులకు మట్టితో తయారు చేయబడినటువంటి విగ్రహాల ఆవశ్యకతను గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ లయన్స్ క్లబ్ బాధ్యులు పయ్యావుల రామచంద్రం,ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, పాటి దేవయ్య, ముత్యాల కృష్ణారెడ్డి, నంది కిషన్, రావుల ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Distribution of clay idols under the auspices of the Lions Club