బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల అశోక్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలలో అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటివి అమలు చేస్తున్నారని మిగిలిన హామీలను కూడా అమలు చేస్తారని చెప్పారు. చెక్కులను మంజూరు చేయించినందుకుగాను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారుల తరఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ వీడీసీ అధ్యక్షుడు జక్కం అశోక్, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, జైడి చిన్న గంగారం, శ్రీధర్, నసీర్, మహమ్మద్ అమ్జాద్, నాగభూషణం, జక్కం అశోక్, కుదురుపాక ప్రవీణ్, వడ్యాట్ దాపారం రవి, జైడి పెద్ద గంగారం, బాబు, కడపటి రాజేశ్వర్, కడపటి రమేష్, తక్కురి సతీష్, తేజ, నూతుల రాజేందర్, సుదం, గురువయ్య, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.