Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 3:08 pm Posted by : ramakrishna

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పంపిణీ చేయడం జరిగింది. గ్రామానికి చెందిన గంగారాజుల దేవాయి రూ.26,000 , ఏనుగుర్తి లావణ్య రూ.18,000 చెక్కులను అందించడం జరిగింది. లబ్ధిదారులు ముత్యాల సునీల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యలా రాములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి దేవేందర్,అనిల్,శ్యామ్ గౌడ్,పత్రి మహేష్,నీశాంత్, నరేష్, సాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.