డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు చెక్కుల అందజేత

బాన్సువాడ , బతుకమ్మ  : బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల పరిధిలోని  మీర్జాపూర్, సంగెం, బొమ్మన్ దేవ్ పల్లి గ్రామాల డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరైన బిల్లుల చెక్కులను 65 మంది లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నాయకులు ఏజాస్, యండి. దావూద్, నసురుల్లాబాద్ మండల నాయకులు పాల్గొన్నారు.