సత్యసాయి ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అల్పాహారం పంపిణీ
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముబారక్ నగర్ లో శ్రీ సత్య సాయి ట్రస్ట్ వారి సహకారంతో విద్యార్థులకొరకు ఏర్పాటు చేయబడిన అల్పాహార కార్యక్రమాన్ని 18 డివిజన్ కార్పొరేటర్ యమునా అనీల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సత్య గంగు, ముబారక్ నగర్ గ్రామాభివృద్ది కమిటీ సదర్, ఇతర సభ్యులు, గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ అల్పాహారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నందుకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారికి ఇందుకు కృషి చేసిన...