Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 2:47 pm Posted by : ramakrishna

సత్యసాయి ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముబారక్ నగర్ లో శ్రీ సత్య సాయి ట్రస్ట్ వారి సహకారంతో విద్యార్థులకొరకు ఏర్పాటు చేయబడిన అల్పాహార కార్యక్రమాన్ని 18 డివిజన్ కార్పొరేటర్ యమునా అనీల్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సత్య గంగు, ముబారక్ నగర్ గ్రామాభివృద్ది కమిటీ సదర్, ఇతర సభ్యులు, గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ అల్పాహారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నందుకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారికి ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు పోచాద్రి కి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదలు తెలిపారు.

Distribution of breakfast to government school students in collaboration with Sathya Sai Trust