ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని కేకే తండా గ్రామంలో జనం సాక్షి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, ఎనర్జీ డ్రింకులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యాతిధిగా లయన్స్ జోన్ చైర్మెన్ అబ్బాయి లింబాద్రి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాల న్నారు. పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పి.రాఘవేందర్, చింతల గంగాదాస్, కోశాధికారి అంకం రాజేందర్, వెంగల్ పాడ్ ఉప సర్పంచ్ మహిపాల్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యెర్రగుంట కృష్ణవేణి, ఉపాద్యాయులు శిరీష, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
