Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 3:42 pm Posted by : ramakrishna

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాదు నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా,వర్ని రోడ్డు, హనుమాన్ మందిరాల వద్ద యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.అందులో భాగంగా రెండు హనుమాన్ మందిరాల వద్ద దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్,కార్యదర్శి చెన్న రవీందర్, కోశాధికారి పి.రాఘవేందర్, పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్, ఇరుమల శివలింగం, ప్రోగ్రాం చైర్మెన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Distribution of blankets under the aegis of Lions Club