హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ : హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారు హైదరాబాద్ వారి ఆద్వర్యంలో శనివారం రుద్రూర్ గ్రామంలో 24 మంది వయోవృద్ధులకు దుప్పట్లు ఉచితంగా పంపిణి చేయడం జరిగిందని రమేష్ తెలిపారు. గ్రామప్రజలు, వయోవృద్ధులు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.