మల్లాపూర్ లో గృహజ్యోతి పథకం బిల్లుల పంపిణీ

మద్నూర్, బతుకమ్మ :   డోంగ్లీ మండల్ మల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ విద్యుత్తు బిల్లులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు వరకు ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్తు అందిస్తుంది, ఆ బిల్లులను గ్రామ సర్పంచ్ అమృత్వార్ శ్రీకాంత్ గ్రామ వినియోగదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గృహ జ్యోతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.