విద్యార్థులకు ఆల్బెండజాల్ మాత్రల పంపిణీ

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజాల్ 400 మి.గ్రా. మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజాల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక ఆల్బెండజాల్ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు....