బతుకమ్మ, పిట్లం : విధుల్లో ఉత్తమ సేవలకుగాను పిట్లం ఏఎస్ఐ లింబాద్రి కేంద్ర హోం శాఖ అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనకు సేవా పథకాన్ని అందజేశారు. ఏఎస్ఐ లింబాద్రి అవార్డు అందుకోవడం పట్ల పిట్లం పోలీసు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.